`మనశంకర వరప్రసాద్ గారు` ప్రచారం పనులు మొదలైపోయాయి. రిలీజ్ కు ఇంకా రెండు వారాలే సమయ ఉంది. ఉన్న ఈ తక్కువ సమయంలో వీలైనంత వరకూ జనాల ముందుకు సినిమా తీసుకెళ్లాలని దర్శకుడు అనీల్ రవిపూడి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. సినిమా ప్రచారమంటే సాధారంగా పీఆర్ టీమ్ చూసుకుంటుంది. కానీ అనీల్ సినిమా అంటే? పీఆర్ అవసరం లేదు. ఆయనే పీఆర్ అయిపోతాడు. అవసరమైతే యాంకర్ గా కూడా మారిపోతాడు.
ఆ రకంగా నిర్మాతకు కొంత ఖర్చు కూడా తగ్గిస్తాడు. ఇలాంటి ప్రణాళికలన్నీ అనీల్ వద్ద ముందే సిద్దంగా ఉంటాయి. శంకర వరప్రసాద్ విషయంలోనూ అనీల్ ప్రచార పరంగా ఎక్కడా తగ్గడు. అందులోనూ అన్నయ్య సినిమా కాబట్టి మరింత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తాడు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ..ఇతర ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్ నయతార జాయిన్ అవుతుందా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి
ఈ సినిమా ప్రారంభానికి ముందే ప్రీ లాంచ్ కార్యక్రమంలో నయన్ ఎంత ఉత్సాహంగా పాల్గొందో తెలిసిందే. చిరంజీవి..అనీల్ తో కలిసి ప్రమోషన్ లో భాగమైంది. హలో మాష్టారు సైడ్ ఇవ్వండి అంటూ తనదైన మార్క్ వేసింది. లేడీ సూపర్ స్టార్ ప్రచారంలో పాల్గొంటే ఓ వైబ్ ఉంటుందని ప్రూవ్ చేసింది. కానీ ఆకిక్ చివర్లో ఉండేలా లేదు. ఈ సినిమాకు సంబంధించి నయనతార తదుపరి ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని ఓ వార్త వినిపిస్తోంది.
చిరంజీవి సినిమా కాబట్టి అనీల్ అడగగానే ప్రీలాంచ్ ప్రచారంలో పాల్గొందని...ప్రీ రిలీజ్ విషయంలో మాత్రం తన కండీషన్లు అప్లై అవుతాయని ముందే చెప్పేసిందిట. చివర్లో హాజరవ్వడం ఎలాగూ కుదరదనే ముందుగానే మాట కాదనకుండా? కొన్ని నిమిషాల వీడియోకు ఓకే చెప్పినట్లు ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.