బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలిచిన కళ్యాణ్ పడాల ను గెలిపించిన రివ్యూయర్ ఆది రెడ్డి ఇప్పుడు కళ్యాణ్ కు చాలా సలహాలు ఇస్తున్నాడు. ముందు వరకు తనూజా ను సపోర్ట్ చేసి రెండు వారాల క్రితం నుంచి కళ్యాణ్ పడాల ను సపోర్ట్ చేస్తూ గెలిచే వరకు సోషల్ మీడియాలో హోరెత్తించిన ఆది రెడ్డి కళ్యాణ్ పడాల కు విలువైన సలహాలు ఇస్తున్నాడు.
కళ్యాణ్ నువ్వు ఈ గెలుపుని నెత్తినెట్టించుకోకు, మీడియా తో జాగ్రత్తగా మాట్లాడు, కొన్నిరోజుల పాటు మీడియా కు దూరంగా, మీడియా ను అవాయిడ్ చెయ్యడం బెటర్. విన్నర్ అయ్యాక హడావిడి చెయ్యకు, మీడియా తో మాట్లాడేటప్పుడు మాట జారకు, లేదంటే ట్రోల్స్ చేస్తారు, నెగెటివ్ చేస్తారు, విజయం వెనుకే నెగిటివిటీ ఉంటుంది. ఎంతమంది ఎన్ని నెగెటివ్ కామెంట్స్ చేసిన రియాక్ట్ అవ్వకు.
సోషల్ మీడియా ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి కళ్యాణ్ పడాల అంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి కళ్యాణ్ పడాల కు ఇస్తున్న సలహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.