సోషల్ మీడియాలో ఏ హీరో సినిమా అయినా బాగోకపోతే యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమాలను ట్రోల్ చేయడమనేది ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా అఖండ 2 తాండవానికి థియేటర్స్ లో నెగెటివ్ టాక్ రాగానే బయట యాంటీ ఫ్యాన్స్ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బాలయ్య ను, అఖండ 2 ను విపరీతంగా ట్రోల్ చేసి రాక్షసానందం పొందారు.
అయితే ఇప్పుడు మెగాస్టార్ వంతు అంటూ బ్లూ మీడియా అప్పుడే మెగాస్టార్ చిరుని భయపెట్టడం స్టార్ట్ చేసింది. జనవరి 12 న చిరు-అనిల్ రావిపూడి ల మన శంకర వరప్రసాద్ గారు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడం చూసిన బ్లూ మీడియా మెగాస్టార్ ని హెచ్చరిస్తుంది.
సినిమాకి ఏమైనా టాక్ తేడాకొడితే.. ఆయన్ని ఆయన సినిమాని సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు, వైసీపీ అభిమానులు తగులుకోవడానికి రెడీగా ఉన్నారు, విపరీతంగా ట్రోల్ చేస్తారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు చిరు కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పుకోవడమే కాదు, అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఆ విషయమై ఎంతమంది ఎన్ని మట్లాడినా చిరు ఖండించలేదు.
జగన్ చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, ఆ కృతజ్ఞత కూడా లేదు. జగన్ విషయంలో చిరు స్టాండ్ తీసుకోలేదు, ఇప్పుడు చిరు సినిమా వస్తే ఆ సినిమా పై ట్రోల్ చెయ్యడానికి వైసీపీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు, అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికే చిరు గిఫ్ట్స్ ఇస్తున్నారు.. మరి యాంటీ ఫ్యాన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తారు, ముఖ్యంగా వైసీపీ అభిమానులు చిరు ఎలా తట్టుకుంటారు.
వైసీపీ అభిమానులు చిరు సినిమాపై నెగిటివిటి లేకుండా చెయ్యాలంటే చాలా కష్టం అంటూ బ్లూ మీడియా చిరు ని భయపట్టే వార్తలను ప్రచారంలోకి తెచ్చింది.
ఆ ఆర్టికల్స్ చూసిన వారు మెగా ఫ్యాన్స్ పేరుతో బాలయ్యని, బాలయ్య ఫ్యాన్స్ పేరుతో చిరుని ట్రొల్ చెసి... ఆ ఇద్దరి మధ్య గొడవలు పెట్టెది ఎవరొ అందరికీ తెలుసు! అంటూ రియాక్ట్ అవుతున్నారు.