కప్పు కొడతాడు, ఈసారి బిగ్ బాస్ 9 కప్ కొట్టేది ఒక కమెడియన్, బిగ్ బాస్ ట్రోఫీ గెలిచి కమెడియన్ ఇమ్మాన్యుయేల్ చరిత్ర సృష్టిస్తాడని చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముందు నుంచి నాగార్జున చేత వారం వారం పొగిడించుకుని, ఆటలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పోటీపడి గెలిచి హౌస్ లో మూడుసార్లు కెప్టెన్ అయ్యి సంచలనంగా మారిన ఇమ్మన్యుయెల్ టాప్ 4 నుంచి ఎలిమినేట్ అవడం ఇమ్మన్యుయెల్ డైజెస్ట్ చేసుకోలేకపోవడం కాదు ముఖ్యంగా అందరికి షాకిచ్చింది.
బిగ్ బాస్ బజ్ లోను శివాజికి అదే అన్నారు. ఇమ్మాన్యుయేల్ కూడా అవును అన్న నామినేషన్స్ లోకి రాకపోవడమే నా తప్పు, నేను ప్రతి చిన్న విషయాన్ని తప్పు అని అర్ధం చేసుకునేసరికి అప్పుడే పదో వారం వచ్చేసింది. చిన్న చిన్న తప్పులపై ఫైట్ చెయ్యకపోవడం నాకు డ్యామేజ్ అయ్యింది. నాకు మమ్మ బాండింగ్ కూడా మైనస్ అయ్యింది. నా ఓట్లు సంజన గారికి పడ్డాయి అది నా ఒపీనియన్ అంటూ BB 9 బజ్ లో ఇమ్మాన్యుయేల్ శివాజీ తో చెప్పాడు.
అది నిజమే.. కామెడీ చేసి, ఆ కామెడీని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇమ్ము కి ఓటెయ్యడం మర్చిపోయారు. శివాజీ చెప్పింది అక్షరాలా నిజం. ఇక 4th పొజిషన్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇమ్మాన్యుయేల్ ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, మీడియా మీట్ పెట్టడం కానీ చెయ్యలేదు. ఇమ్ము ఫస్ట్ ఇంటర్వ్యూ శివాజీ బజ్ లోనే.