నయనతార తో ఎవరు సినిమా చేసినా ఆమెతో జస్ట్ యాక్టింగ్ చేయించగలరు కానీ.. ఆమెతో సినిమా ని ప్రమోట్ చేయించలేరు. సినిమా ప్రమోషన్స్ అంటే ఆమె ఎక్కువ పారితోషికం అడుగుతుంది అనో, లేదంటే నయనతారకు ప్రమోషన్స్ కి రాననే సెంటిమెంట్ ఉంటుందో తెలియదు కానీ.. ఆమె నటించే సినిమా ప్రమోషన్స్ లో నయన్ అస్సలు కనిపించదు.
కానీ నయనతార తన భర్త విగ్నేష్ శివన్ కోసం సెంటిమెంట్ పక్కనపెడుతుంది. అలాంటి నయనతార ను మన దర్శకుడు అనిల్ రావిపూడి మాములుగా వాడడం లేదు. మెగాస్టార్ చిరు తో మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో హీరోయిన్ గా నయనతారను అనౌన్స్ చేసిన వీడియో నే అందరికి షాకిచ్చింది.
ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గరకొచ్చేసింది. అందులో భాగంగా నయనతార మీద ఒక ప్రమోషనల్ వీడియో షూట్ చెయ్యడమే కాదు మన శంకర వరప్రసాద్ గారు టీం ఆ వీడియో ని విడుదల చేయబోతుంది అని తెలుస్తుంది. మరి నయనతార ను ఈ రేంజ్ లో ఏ డైరెక్టర్ వాడుండరు. నయన్ ఈ చిత్ర యూనిట్ కి ఎందుకిలా సహకరిస్తుందో అనేది ఎవ్వరికి అంతుబట్టడమే లేదు మరి.