బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ నటి ముద్దమందారం ఫేమ్ తనూజ టాప్ 5 లోకి రావడమే కాదు విన్నర్ స్థానంలో ఉన్న కళ్యాణ్ పడాల కు టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆమె ఆట కు ఆమె మాటకు, డ్రెస్సింగ్ స్టయిల్ కి ఫిదా అయిన ప్రేక్షకులు తనూజ ను విన్నర్ గా చూడాలని అనుకున్నారు. కానీ కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్ అయ్యాడు.
గ్రాండ్ ఫినాలే రోజున తనూజ ని హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున తనూజ నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే నేను భరణి గారికి చెప్పాలి, ఆయన నన్ను హెల్ప్ చెయ్యమన్నప్పుడు చెయ్యలేకపోయాను అంటూ భరణి సర్ సారీ అంది. దానికి భరణి సారీ ని యాక్సెప్ట్ చేశాను అన్నాడు.
ఇక నీకు బయట ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సారీ చెప్పాలనుకుంటున్నావా అంటే నన్ను ఒకరు ముద్దు ముద్దు మాటలు చెబుతూ ముద్దమందారం పువ్వు చెవిలో పెడుతున్నారు అన్నారు, ఆ మాట నాకు బాధ అనిపించింది అంది. ఆ మాట ఎక్స్ కంటెస్టెంట్ మర్యాద మనీష్ నామినేషన్స్ అప్పుడు అన్నాడు, అతడు రెండు వారాలకె ఎలిమినేట్ అయినా మధ్యలో ఎక్స్ హౌస్ మేట్స్ నామినేషన్స్ అప్పుడు అతను తనుజను టార్గెట్ చేసాడు.
తాజాగా మర్యాద మనీష్ తనూజ కు సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు, నేను బిగ్ బాస్ స్టేజ్ పైనే తనూజ కు సారీ చెప్పాను, అది మీకు తెలియదు, నా మాటల వలన తనూజ హార్ట్ అయ్యాను అంది, అది నేను గేమ్ పరంగానే చెప్పాను, ఆమె ఆట, ఆమె మాట 105 రోజులు హౌస్ లో ఉండేలా చేసింది, తనూజ ఫైటర్, ఆమెను అందరూ గుర్తుపెట్టుకుంటారు. నేను చాలాసార్లు ఆమెకు ఓట్ చేశాను.
తనూజ అందరి మనసులను గెలిచింది, నా మాటల వల్ల హార్ట్ అయిన తనూజాకు సోషల్ మీడియా వేదికగా సారీ అంటూ తనూజ తో దిగిన ఫోటో ను మర్యాద మనీష్ షేర్ చేసాడు. దానితో తనూజా ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.