రెండు వారాల క్రితమే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికొచ్చిన రీతూ చౌదరి ఇప్పుడు చిక్కుల్లో పడింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమెపై గౌతమి చౌదరి దారుణమైన అలిగేషన్స్ చేసింది. హౌస్ లో డిమోన్ పవన్ తో డీప్ ఫ్రెండ్ షిప్ పెట్టుకుని టాప్ 5 కి వెళ్లాల్సిన రీతూ చౌదరి రెండు వారాల క్రితమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఇక ఇప్పడు ఆమె హైదరాబాద్ లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయానికి హాజరావాల్సి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో రీతూ చౌదరి తో విచారణకు హాజరయ్యింది. ఆమెతో పాటుగా లక్ష్మి మంచు, భయ్యా సన్నీ యాదవ్ లు ఈరోజు మంగళవారం విచారణకు హాజరయ్యారు.
మరి బిగ్ బాస్ నుంచి వచ్చాక యూట్యూబ్ ఇంటర్వూస్ అలాగే కెరీర్ లో బిజీ అవ్వడమేమో కానీ.. ఇలా బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు వెళుతోంది రీతూ చౌదరి.