మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్వకత్వంలో స్పోర్స్ట్ బ్యాక్ బ్రాప్లో ఓ పీరియాడిక్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. మైసూర్ లొ మొదలైన షూటింగ్ హైదరాదాద్ తో క్లైమాక్స్ కు రీచ్ అయింది. షూట్ మొదలైన నాటి నుంచి చరణ్ అండ్ కో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. బుచ్చిబాబు ఆదేశాల మేరకు నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ కూడా చెప్పిన టైమ్ కి సాధ్యమవుతుంది.
మార్చిలో సినిమా రిలీజ్ దాదాపు ఖాయమే. మొన్నటి వరకూ హైదరాబాద్ లోనే షూటింగ్ నిర్వహించిన బుచ్చిబాబు ఒక్క సారిగా దేశ రాజధాని ఢిల్లికి షూట్ మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరి స్తున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలిసింది. ఇందులో ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు. అయితే చరణ్ అటెండ్ అయ్యాడా? లేదా? అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా మొదలైన నాటి నుంచి బుచ్చిబాబు కూడా పెద్దగా గోప్యత పాటించలేదు.
వీలైనంత వరకూ అప్ డేట్స్ ఇచ్చాడు. చరణ్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన తప్పుడు ప్రచారాలకు తావు ఇవ్వలేదు. ఢిల్లీ షూట్ కు సంబంధించి చిత్రీకరణమొదలైన నాటి నుంచి రాజధాని లో షూట్ చేయడం రెండవసారి. ఇప్పటికే ఓ సారి వెళ్లొచ్చి అక్కడ కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. అందులో రామ్ చరణ్ , శివ రాజ్ కుమార్ పాల్గొన్నారు. సైమల్టేనియస్ గా హైదరాబాద్ లో జరుగుతోన్న షెడ్యూల్ కి కంటున్యూటీ సీన్స్ అవి.
మళ్లీ హైదరాబాద్ నుంచే ఢిల్లీకి రీచ్ అవ్వడం షూట్ చేయడం చూస్తుంటే? ఇవీ కంటున్యూటీ సన్నివేశాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి `పెద్ది`లో ఢిల్లీ కూడా కీలక భూమిక పోషిస్తుందన్నది క్లియర్. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జాన్వీ కూడా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టింది. షూట్ మధ్యలో డిస్టర్బ్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది కొత్త చిత్రాల అప్ డేట్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంది.