మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మనశంకర వరప్రసాద్ గారు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పనులు కూడా ప్రారంభించారు. సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సిని మాకుసంబంధించి షూటింగ్ అప్ డేట్ ఏంటి? ఇంకా ఎన్ని రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది? అంటే మరో రెండు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టబోతున్నారని తెలిసింది.
ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో షూటింగ్ చేస్తున్నారు. పెండింగ్ సన్నివే శాలకు సంబంధించి వాటిని పూర్తి చేసే పనిలో అనీల్ టీమ్ బిజీ గా ఉంది. ఇప్ప టికే చిరంజీవి సహా చాలా మంది నటీనటులపై షూట్ పూర్తయింది. వారు ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ పూర్తి చేసి రిలీవ్ అయిపోయారు. అయితే డబ్బింగ్ మాత్రం ఇంకా పెడింగ్ లోనే ఉంది. ప్రస్తుతం అనీల్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఆ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి.
ఇప్పటి నుంచి సినిమా ప్రచారం అనీల్ ఇంకెంత వినూత్నంగా చేస్తాడు? అన్నది ఆసక్తికరం. ఏ సినిమా అయినా రిలీజ్ కుముందు డిఫరెంట్ వేలో ప్రచారం చేయ డం అనీల్ ప్రత్యేకత. అన్నింటా తాను ఉన్నానంటూ అన్ని పను ల్లోనూ వేలు పెడతాడు. అవసరమైతే యాంకర్ గానూ మారిపోతాడు. మరి శంకర ప్రసాద్ చిత్రా న్ని జనాల్లోకి తీసెకెళ్లేందుకు ఎలాంటి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు? అన్నది తెలియాలి.
అలాగే ఈ సినిమా తుది ప్రచారం కోసం నయనతార హాజరవుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి. ఈ సినిమా ప్రీలాంచ్ ప్రచారంలో నయనతార పాల్గొన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రచారమంటే ఆమడ దూరంలో ఉండే నయనతార వరప్రసాద్ ప్రచారంలో పాల్గొనడం అందరికీ ఓ షాకింగ్ లాంటింది. మరి తుదిగా జరిగే ప్రీరిలీజ్ కోసం అనీల్ అమెను ఎలా కన్విన్స్ చేస్తాడు? అన్నది చూడాలి.