మహిళలను కించపరుస్తూ దండోరా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై అనసూయ, చిన్మయిలాంటి వాళ్ళు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. కామెంట్స్ కి మంచు మనోజ్ మహిళలకు సారీ చెప్పాడు. ఇక ఇప్పడూ శివాజీ పై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. అంతేకాదు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజికి మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మహిళా కమిషన్ ముందు ఈనెల 27 వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని శివాజికి నోటీసులు జారీ చేసారు. అయితే శివాజీ మాత్రం తాను మాట్లాడిన మాటలకు సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.
ఈమధ్యకాలంలో హీరోయిన్స్ ఇబ్బందిపడ్డ కారణంగా నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అన్ పార్లమెంటరీ పదాలను యూస్ చెయ్యడం జరిగింది, దానివల్ల ఎవ్వరికైనా మనోభావాలు దెబ్బతింటాయి, నేను మాట్లాడింది అమ్మాయిలందరి గురించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పను, ఏది ఏమైనా రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి.
దానికి నేను సిన్సియర్ గా అప్పాలజిస్ చెబుతున్నాను, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక అమ్మవారిలా అనుకుంటాను, సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనకు తెలుసు. అందుకే నేను అలా ఊరు లాంగ్వేజ్ లో మాట్లాడాను, దానికి నిజంగా సారీ చెబుతున్నాడు అంటూ శివాజీ వీడియో వదలడం చూసి.. శివాజీ సారీ చెప్పాడురా ఇక వదిలెయ్యండి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.