బిగ్ బాస్ అంటూ నార్త్ కల్చర్ ని టాలీవుడ్ కి తీసుకొచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో మొట్టమొదటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఆ సీజన్ పూణే లో సెట్ వేసి చేసారు, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎలాంటి లీకులు లేవు, ఎలాంటి గందరగోళము లేదు, ఆ సీజన్ ట్రోఫీ ని శివబాలాజీ గెలుచుకున్నాడు.
ఆతరవాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి నాని హోస్ట్ తో రెండో సీజన్ నడిచింది. ఆ సీజన్ కాంట్రవర్సీలకు నిలయంగా మారింది. కౌశల్ ఆర్మీ రచ్చ చేసింది. ఆ సీజన్ కౌశల్ గెలిచాడు. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ ప్లేస్ కి వచ్చారు. మూడో సీజన్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ ట్రోఫీని నటుడు అభిజిత్, ఐదో సీజన్ ను సన్నీ గెలిచారు.
ఆరో సీజన్ ను సింగర్ రేవంత్ గెలవగా, ఏడో సీజన్ ను జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్ ఎగరేసుకుపోయాడు. ఆ సీజన్ గ్రాండ్ ఫినాలే రచ్చ రచ్చ అయ్యి పల్లవి ప్రశాంత్ జైలుకుపోయాడు, ఇక ఎనిమిదో సీజన్ ని కన్నడ యాక్టర్ నిఖిల్ గెలవగా ఈ తొమ్మిదో సీజన్ ను ఆర్మీ అండ్ కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల గెలిచాడు.
అయితే సీజన్ 1 విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి గత రెండు సీజన్ ల విన్నర్స్ పల్లవి ప్రశాంత్, నిఖిల్ వరకు ఎవరు గొప్పగా కెరీర్ లో పీకింది లేదు, బిగ్ బాస్ కి ముందు వారు ఎలా ఉన్నారో, తర్వాత కూడా అలానే ఉన్నారు, బిగ్ బాస్ ట్రోఫీ, ప్రైజ్ మని హడావిడి తప్ప వారి లైఫ్ లో ఎలాంటి మార్పులు లేవు. మరి ఈ సీజన్ విన్నర్ కామనర్ కళ్యాణ్ పడాల ఏం చేస్తాడో చూడాలి.