బిగ్ బాస్ సీజన్ 9 లో ట్రెడిషనల్ గా డ్రెస్సింగ్ స్టయిల్ తోనూ కేరెక్టర్ తోనూ ఆకట్టుకున్న కంటెస్టెంట్ ఎవరు అంటే టక్కున తనూజ ప్రేరే చెబుతారు. కన్నడ అమ్మాయే కానీ తెలుగు అమ్మాయి మాదిరి తెలుగు మట్లాడడం, డ్రెస్సెస్ వేసుకోవడం తెలుగు ప్రేక్షకులకు నచ్చేసాయి. అయితే తనూజ హౌస్ లో ఎక్కువగా ఎమోషనల్ అయ్యేది. నాన్న అంటూ భరణ తో బాండింగ్ పెట్టుకుంది.
అయితే తనూజ అంతగా తపనపడి, అంతగా తల్లడిల్లింది, తన తండ్రి కోసమే. ఆ విషయమే ఆమె రన్నర్ గా మిగిలాక శివాజీ బిగ్ బాస్ బజ్ లో చెప్పింది. ఎందుకు ఊరికే ఏడుస్తావు తనూజ అని శివాజీ అడిగితె, బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు తన తండ్రికి చెప్పలేదు, ఆయనకు ఈ ప్రోఫెషన్ అంటే ఇష్టం ఉండదు, కానీ వచ్చా అంది.
మరి విన్నర్ అవ్వలేదు కదా ఆ 20 లక్షల సూట్ కేస్ తీసుకోవాల్సింది కదా అని హోస్ట్ శివాజీ అడిగితె.. దానికి నాకు డబ్బు కాదు ముఖ్యం. నాకు ట్రోఫీనే ముఖ్యం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు ముఖ్యం. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ వచ్చారు. తల్లి, తండ్రి ఇద్దరూ ఉన్నారు. మా నాన్న వస్తారు అనుకున్నాను, కానీ మా నాన్న రాలేదు.
నేను ట్రోఫీ గెలిస్తే ఆయన చేతుల్లో బిగ్ బాస్ ట్రోఫీ పెట్టి ఇది నాన్న మీ కూతురు, ప్రొఫెషన్ మారినంత మాత్రాన మీ కూతురు మారదు అని చెప్పాలనుకున్నాను అంటూ తనూజ శివాజీ బజ్ లో తన తండ్రి గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు లైఫ్ లాంగ్ నా తండ్రి పేరు నా పేరు చివర ఉంటుంది. తనూజ పుట్టస్వామి అంటూ ఆమె గర్వంగా చెప్పిన తీరుకి తనూజ లో ఇంత బాధ ఉందా అని ఆ బజ్ ప్రోమో చూసిన వారు కూడా ఎమోషనల్ అవడం గమనార్హం.