అక్కినేని నాగార్జున ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య కు భార్యగా తన కర్తవ్యం నిర్వర్తిస్తూనే తన ప్రొఫెషన్ లో బిజీగా ఉంటుంది. పెళ్లి తర్వాత భర్త చైతు తో కలిసి ఉండడానికి కుదరక తన షూటింగ్ కోసం చెన్నై లో ఉన్నట్లుగా మొదటి యానివర్సరీకి బయటపెట్టింది శోభిత దూళిపాళ్ల.
ఇక ప్రొఫెషనల్ గా షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే శోభిత ఫోటో షూట్స్, యాడ్ షూట్స్ అంటూ రచ్చ చేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో శోభిత గ్లామర్ షో వేరే లెవల్ అన్నట్టుగా ఉంటుంది. తాజాగా ఓ మ్యాగజైన్ షూట్ కోసం శోభిత చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే అక్కినేని కోడలు ఈ రేంజ్ లో గ్లామర్ షో అంటూ నోరెళ్లబెడుతున్నారు.
మ్యాగజైన్ కవర్ షూట్ కోసం శోభిత చేయించుకున్న ఈ గ్లామర్ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది.