మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతుంది. వరప్రసాద్ నుంచి వస్తున్న సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తున్నాయి. అంతేకాదు మెగాస్టార్ లుక్స్ చూసుకుని మెగా ఫ్యాన్స్ ఫుల్ గా ఇంప్రెస్స్ అవుతున్నారు.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీ రోల్ కనిపించబోతున్నారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై నటుడు శివాజీ దండోరా చిత్ర ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి గెస్ట్ గా రాగా.. శివాజీ మట్లాడుతూ.. మన శంకర వరప్రసాద్ గారు లోని ఓ విషయాన్ని లీక్ చేస్తున్నాను అంటూ..
ఈ చిత్రం లో ఓ ఇద్దరు స్టార్స్(చిరంజీవి-వెంకటేష్) కలిసాక ఉంటుంది సినిమా అంటూ ఇంతకుమించి చెబితే మా వాడు(అనిల్ రావిపూడి) కంగారు పడతాడు అంటూ మన శంకర వరప్రసాద్ గారు చెబుతూ అంచనాలు క్రియేట్ చేసారు. మరి చిరు-వెంకీ ఇద్దరూ మన శంకర వరప్రసాద్ గారు లో ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో ఓ 20 రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.