కింగ్ డమ్ తర్వాత రిలాక్స్ అవ్వకుండా వెంటనే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో VD15 ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాడు. ఈరోజు డిసెంబర్ 22 న VD15 టైటిల్ గ్లింప్స్ అంటూ మేకర్స్ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులను అలర్ట్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన VD15 గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ ని రౌడీ జనార్ధనగా పరిచయం చేసారు. రౌడీ జనార్దన్ టైటిల్ ని సార్ధకత చేసే మాదిరి విజయ్ దేవరకొండ కేరెక్టర్ అలాగే, సినిమా నేపథ్యం ఉండబోతుంది అనేది ఈ గ్లింప్స్ లోనే రవి కిరణ్ కోలా హింట్ ఇచ్చేసారు. రౌడీ అంటే అలాంటి ఇలాంటి రౌడీ కాదు.. తలలు తెగ నరికే రౌడీ.
కళింగపట్టణంలో ఇంటికొకరు రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు, కానీ ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడున్నాడు.. జనార్దన, రౌడీ జనార్దన అంటూ పవర్ ఫుల్ గా విజయ్ దేవరకొండ కేరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసారు. ఈ గ్లింప్స్ లో BGM అయితే సూపర్ హైలెట్ అవుతుంది. గ్లింప్స్ తో ఈప్రాజెక్టు పై పాన్ ఇండియా మార్కెట్ లో అంచనాలు పెంచేసారినిపిస్తుంది.