సినీ నటి ప్రగతి రీసెంట్ గా పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 50 ఏళ్ళ వయసులో ఆమె మెడల్ సాధించడం సంచనలం అయ్యింది. నటిగా అవకాశాలు తగ్గడంతో పవర్ లిఫ్టింగ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఇండియా కి మెడల్ సాధించిన ప్రగతి పలు ఇంటర్వూస్ లో బిజీగా కనిపించింది.
అయితే ప్రగతి గోల్డ్ మెడల్ సాధించి అందరి చూపు తనపైన పడేలా చేసుకుంటే. కాంట్రవర్సీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాత్రం తను ప్రగతి గెలవాలని చేసిన స్పెషల్ పూజల వల్లే ప్రగతికి పవర్ లిఫ్టింగ్ లో గెలిచి ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది అంటూ డబ్బా కొట్టుకోవడం పై ప్రగతి రీసెంట్ పాడ్ కాస్ట్ లో ఫైర్ అయ్యింది.
ప్రగతి మెడల్ గెలవకముందు ఆమె కూతురు తో కలిసి వేణు స్వామితో పూజలు చేయించుకున్న ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. అందుకే వేణుస్వామి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకున్నారు.
వేణు స్వామి నీ పూజల వల్లే నాకు మెడల్ వచ్చిందా.. నీకు అసలు సంస్కారం ఉందా... నీ పూజల వల్ల ఎలాంటి ఫలితం లేదు.. ఉన్న ఆరోగ్యం పోయింది అంటూ ప్రగతి పాడ్ కాస్ట్ లో వేణు స్వామిని కడిగిపారేసింది.