అక్కినేని యువ హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో హీరోయిన్ శోభిత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగ చైతన్య, మొదటి భార్య సమంతకు విడాకులిచ్చాక శోభిత ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని వైజాగ్ అల్లుడిగా మారిపోయాడు. శోభిత అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది.
రీసెంట్ గానే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరిని చేసుకున్న నాగ చైతన్య-శోభిత ల జంట తమ ప్రేమ ఎలా మొదలైంది, ఎలా పెళ్లి చేసుకొనింది, తర్వాత ఎలా తమ లైఫ్ లో మూవ్ అవుతున్నది చెప్పుకొచ్చారు.
తాజాగా నాగ చైతన్య తన మరదలు అయిన శోభిత చెల్లెలు తో, తన భార్య శోభిత తో కలిసి దిగిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరదలు, భార్య శోభిత తో మా హీరో చైతు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.