బిగ్ బాస్ సీజన్ 9 లోకి టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన కామనర్ డిమోన్ పవన్ రీతూ ఫ్రెండ్ షిప్ వలన గ్రాఫ్ తగ్గించుకున్నాడు. ఆటలో అద్దరగొట్టిన డిమోన్ పవన్ బలం చూపించినా మైండ్ గేమ్ లో వీక్. టాస్క్ ల్లో 100 శాతం ఇచ్చిన డిమోన్ పవన్ రీతూ వలన ఆమె ఫ్రెండ్ షిప్ వలన బయట కాస్త నెగిటివిటి మూటగట్టుకున్నాడు.
ఒకొనొక సమయంలో డిమోన్ పవన్ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చాడు, వోటింగ్ లో వీక్ అయ్యాడు, డేంజర్ జోన్ లో నిలబడిన పవన్ రీతూ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాక పుంజుకోవడమే కాదు కామెడీతో ఆకట్టుకున్నాడు. తనూజ తో కలిసి టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకుంటూ టాప్ 5 కి వచ్చిన డిమోన్ పవన్ టాప్ 4 లో అవుట్ అవుతాడని అనుకుంటే టాప్ 3 లోకి వచ్చి షాకిచ్చాడు.
అయితే టాప్ 3లో ఉన్న పవన్ ని మాస్ మహారాజ్ రవితేజ లోపలి వెళ్లి సూట్ కేస్ ఆఫర్ చేసాడు. పది లక్షలు వద్దు అని, 15 లక్షల ఆఫర్ ని ఒప్పుకుని రవితేజ చేతుల మీదుగా డబ్బు తీసుకున్నాడు. అంతేకాదు టాప్ 3 నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పవన్ అలా క్యాష్ ఉన్న సూట్ కేస్ తీసుకుని మంచి పని చేసాడు.
సో విన్నర్ అవ్వకపోయినా విన్నర్ ప్రైజ్ మని లో నుంచి 15 లక్షల క్యాష్ తీసుకెళ్లిపోయాడు. తనకు క్యాష్ చాలా అవసరమని అందుకే అంటూ పవన్ కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు.