బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రస్తుతం స్టార్ మా లో జరుగుతుంది. సీజన్ 9 లో టాప్ 5 లో ఉన్న సంజన గల్రాని మొదటగా ఎలిమినేట్ అవ్వగా.. టాప్ 4 నుంచి కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. ఇమ్మాన్యుయెల్ ని టాప్ 4 నుంచి ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. కష్టపడి ఆడిన ఇమ్మాన్యూయేల్ ని, కామెడీతో హౌస్ ని భుజాలపై నడిపిన ఇమ్ము ని టాప్ 4 నుంచి పంపించడం పట్ల బిగ్ బాస్ యాజమాన్యంపై అందరిలో నెగిటివిటి ఉంది.
ఇక టాప్ 3 నుంచి డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేసారు. ఇక టాప్ 2 లో ఉన్న తనూజ vs కళ్యాణ్ పడాల లో ఎవరు ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తారో అనే క్యూరియాసిటీ సాధారణ బిగ్ బాస్ ఆడియన్స్ లో ఉంటే.. తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ బయట కొట్టేసుకుంటున్నారు. తనూజాకు సపోర్ట్ చేస్తారన్న చాలామంది ఆర్టిస్ట్ లు తనూజాపై విషం చిమ్ముతున్నారు, అమ్మాయిలు అయ్యుండి అమ్మాయిపై నెగిటివిటి చూపించారు.
కళ్యాణ్ గెలుస్తాడని ఆయన అభిమానులతో పాటుగా సీరియల్ ఆర్టిస్ట్ లు, ఇంకా బిగ్ బాస్ రివ్యూయర్స్ అందరూ కళ్యాణ్ పడాల నే విన్ అవ్వాలని, అవుతాడని చెప్పారు. వారు కోరుకున్నట్టుగానే కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల నే ఈ సీజన్ విన్నర్ అయ్యి చరిత్ర సృష్టించాడు.
ఓ ఆర్మీ మ్యాన్ సరిహద్దుల్లో కాపు కాయడమే కాదు, బిగ్ బాస్ అనే రియాలిటీ షో కి విన్నర్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసాడు. మొదట్లో హౌస్ లో అసలు కనిపించని కళ్యాణ్ పడాల ఇప్పుడు విన్నర్ అవడం, నిజంగా అతని ఎదుగుదల వెనుక తనుజనే ఉంది. అదే కళ్యాణ్ పడాల చెప్పింది కూడా. కళ్యాణ్ గెలిచినా తనూజ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది.
తనూజ గెలిచినా కళ్యాణ్ ప్రౌడ్ గా ఫీలవుతాడు. వాళ్లిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్, కేవలం అభిమానులే కొట్టుకు చచ్చేది. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఈజ్ కళ్యాణ్ పడాల.