సినిమా ప్లాప్ అయితే ఏ హీరోకైనా బాధ ఉంటుంది. వంద సినిమాలు చేసిన అనుభవం ఉన్నా? సరే ఏ నటుకైనా పెయిన్ అన్నది కామన్. మహేష్ సినిమా ఫెయిలైందంటే? వారం రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాడు. ఫెయిల్యూర్ అనే పెయిన్ లోనే ఉంటాడు. వారం తర్వాత ఆ బాధ నుంచి బయటకు వస్తాడు. మళ్లీ యధావిధిగా తన పనుల్లో బిజీ అవుతాడు. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ సైతం దాదాపు అదే తీరులో ఉంటారనే టాక్ ఉంది.
మహేష్ గతంలో ఓపెన్ అయ్యారు కాబట్టి! విషయం బయటకు వచ్చింది. మిగతా తారల విషయంలో అలా ఉంటారు అనే ప్రచారం తప్ప! అందులో నిజానిజాలు తెలియవు. ఆ సంగతి పక్కన బెడితే `లవ్ మౌళి` తో నవదీప్ చాలా కాలానికి హీరో గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నవదీప్ గెటప్.. కంటెంట్ చూసి హిట్ అవు తుందని..మంచి కంబ్యాక్ చిత్రమవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా అంచనాలు అందులేక పోయింది.
అయితే ఈ సినిమా ప్లాప్ విషయంలో నవదీప్ చాలా డిజప్పాయింట్ అయ్యాడని తెలుస్తోంది. సినిమా ప్లాప్ ను తట్టుకోలేక ఇండియా లో ఉండలేక ఆస్ట్రేలియాలో తన సొందరి ఉంటోన్న పెర్త్ సిటీకి వెళ్లిపోయానన్నాడు. అక్కడ మూడు నెలలు పాటు ఉన్నాడుట. సినిమాలు మానేద్దం ..మరో పని చేసుకుందామని భావించా డుట. కానీ మూడు నెలలు గడిచిన తర్వాత ప్లాప్ అనే బాధ నుంచి బయటకు వచ్చి తిరిగి హైదరాబాద్ కి వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.
ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు అనూహ్యంగా ఫలితాలు తారు మారు అయ్యే సరికి ఈ రకమైన అనిశ్చితి సర్వ సాధరణమని మానసిక నిపుణులు చెబుతు న్నారు. ప్రస్తుతం నవదీప్ సినిమాలతో పాటు టీవీ షోలను కూడా హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొత్త ఏడాది లో కెరీర్ ని ఎలా ప్లాన్ చేసాడో తెలియాలి.