Advertisement
Google Ads BL

వారణాసి బడ్జెట్ పై ప్రియాంక చోప్రా కామెంట్స్


సూపర్ స్టార్ మహెష్-దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వారణాసి. రీసెంట్ గా #GlobeTrotter ఈవెంట్ లో వారణాసి సినిమాపై పెంచిన అంచనాలు అన్ని ఇన్ని కావు, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 సమ్మర్ లో రిలీజ్ అంటూ హింట్ కూడా ఇచ్చేసారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కేరెక్టర్ లో కుంభ గా కనిపించబోతున్నారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. 

రీసెంట్ గా ప్రియాంక చోప్రా ముంబైలో క్రేజీ కామెడీ షో కపిల్ శర్మ షో లో పాల్గొంది. ఆ షో లో కపిల్ శర్మ సరదాగా మీరు మందాకినిగా నటిస్తున్న వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. మీరు ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా జాయిన్ అయిన తర్వాత ఆ బడ్జెట్ డబుల్ అయిందట.. నిజమేనా అని అడగగా.. 

దానికి ప్రియాంక చోప్రా నవ్వుతూ.. అంటే వారాణసి బడ్జెట్‌లో సగం డబ్బులు నా అకౌంట్‌లోకి వచ్చాయని చెబుతున్నారా.. అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది. ప్రియాంక అలా వారణాసి పై సరదాగా స్పందించడం మహేష్ అభిమానులకు తెగ నచ్చేసింది.

Priyanka Chopra comments on the Varanasi budget:

Priyanka Chopra rebuts Varanasi budget claim by Kapil Sharma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs