బిగ్ బాస్ సీజన్ 9 లో అటు ఎంటర్టైన్మెంట్ పరంగాను, ఇటు టాస్క్ ల పరంగా ను ఆల్ రౌండర్ గా నిలిచిన ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్ 9 కి విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. హోస్ట్ నాగార్జున చేత ప్రతి వారం పొగిడించుకున్న ఇమ్మాన్యుయేల్ ని టాప్ 4 నుంచి ఎలిమినేట్ చెయ్యడం తో ఆయన అభిమానులే కాదు, ఫ్రెండ్స్, ఆడియన్స్ సైతం షాకయ్యారు.
కనీసం టాప్ 3 లో లేకుండా ఇమ్మాన్యుయేల్ ని ఎలిమినేట్ చెయ్యడం పై బిగ్ బాస్ యాజమాన్యం పై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇమ్ము కి సపోర్ట్ చేస్తుంది. అయితే ఇమ్మానుయేల్ ఫ్రెండ్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, కమెడియన్ రోహిణి ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్ పై చాలా సీరియస్ గా స్పందించింది.
సోషల్ మీడియా వేదికగా రోహిణి థాంక్యూ వెరీ మచ్.. చాలా డిజప్పాయింట్ అయ్యాం. సీరియస్ గా చెప్తున్నాను..ఇమ్మాన్యూయేల్ విషయంలో ప్రతి ప్రేక్షకుడు అలాగే బిగ్ బాస్ టీం కూడా ఫెయిల్ అయ్యింది. ఈ సీజన్ 9 మమ్మల్ని చాలా డిజప్పాయింట్ చేసింది. బిగ్ బాస్ కో దండం. ఇక్కడ కష్టపడినా విలువ ఉండదు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు అని మరోసారి నిరూపించారు.
ఎంటర్టైనర్స్ కేవలం నవ్వించడానికి మాత్రమేనని, ఇమ్మాన్యుయేల్.. నువ్వే అసలైన రియల్ విన్నర్ వి.. ఏది ఏమైనా కానియ్.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. మై డియర్ బ్రదర్ అంటూ రోహిణి చేసిన ట్వీట్ కి ఇమ్ము అభిమానులు సైతం సపోర్ట్ గా ట్వీట్లు పెడుతున్నారు.