బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే కి సిద్దమవుతుంది. రేపు ఆదివారం జరగబోయే బిగ్ బాస్ ఫినాలే షూట్ ఇప్పటికే మొదలైపోయింది. అలాగే ఓటింగ్ లైన్స్ కూడా ముగిసిపోయాయి. టాప్ 5 లో ఉన్న ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారో అనే విషయంలో ఆడియన్స్ లో ఓ క్లారిటీ ఉంది. ఫ్యాన్స్ లో ఫుల్ స్పష్టత ఉంది.
టాప్ 5 నుంచి ఇప్పటికే సంజన ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా వారిలో టాప్ 3లో కాదు కాదు ఓటింగ్ ని బట్టి విన్నర్, రన్నర్ ఫిక్స్ అయినట్లుగా టాక్ వినబడుతుంది. అందులో కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వగా, రన్నర్ గా తనూజ నిలుస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే వోటింగ్స్ బట్టి కమెడియన్ ఇమ్మాన్యుయెల్ రన్నర్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది.
కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అందుకోబోతున్నాడని, ఇమ్మాన్యుయెల్ రన్నర్ గా నిలిస్తే తనూజ టాప్ 3 తో సరిపెట్టుకోబోతుంది అంటున్నారు. టాప్ 4 నుంచి డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేయనున్నారని వినికిడి.