బ్యూటిఫుల్ అండ్ స్వీట్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేకపోయినా ఆమె వెనుక దర్శకనిర్మాతలు పడడం మాత్రం మానడం లేదు. వరస ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి చేసి అదే అవకాశాలు వైఫల్యాలుగా మారిపోయి ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి.
అయితే సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా కనిపించని భాగ్యశ్రీ బోర్సే ఈమధ్యన మెల్లగా ఫొటోస్ షూట్స్ వదలడం స్టార్ట్ చేసింది. సక్సెస్ ఉంటే ఇవేమి చెయ్యక్కర్లేదు. కానీ ఇప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న భాగ్యశ్రీ బోర్సే కి సోషల్ మీడియా అటెన్షన్ అవసరమని గుర్తించింది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంది.
తాజాగా భాగ్యశ్రీ బోర్సే షేర్ చేసిన పిక్స్ చూస్తే సో స్వీట్, సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెట్టాల్సిందే. మోడ్రెన్ వేర్ అయినా ఆమె లుక్స్ ట్రెడిషనల్ గా కనిపించడంతో ఆమె అభిమానులు ఇంత చక్కటి హీరోయిన్ కి కొద్దిగా అదృష్టం ప్రసాదించు దేవుడా అంటూ వేడుకుంటున్నారు.
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే కి లెనిన్ చిత్రంతో పాటుగా రీసెంట్ గా స్వప్న మూవీస్ లో లేడీ ఓరియెంటెడ్ అవకాశం వచ్చింది అనే టాక్ ఉంది.