చిన్న సినిమాలకు పెద్ద వాళ్ల ప్రోత్సాహం అన్నది ఎంతైనా అవసరం. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఓ చిన్న సినిమా గురించి చిన్న ట్వీట్ వేసినా? ఆ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లాంటివి లాంచ్ చేసినా? లేదా లైవ్ ఈ వెంట్లకు హాజరైనా లక్షల రూపాయల పబ్లిసిటీ దక్కినట్లే. స్టార్స్ చేతుల మీదుగా ప్రచారం దక్కిందంటే? ఆ సినిమా కు రీచ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి విషయాల్లో మన స్టార్స్, డైరెక్టర్ల నుంచి చిన్న సినిమాలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది అంటే? ఒక్క నెగిటివ్ కామెంట్ కు కూడా అవకాశం లేదనే చెప్పాలి.
రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ ఇలా ఏ స్టార్ అయినా? చిన్న సినిమాలకు తమ పరంగా కలిసొస్తుందంటే ఆ సినిమా లైవ్ ఈవెంట్లకు రాలేకపోయినా? వ్యక్తిగతంగా కలిస్తే రిలీజ్ లు అన్నవి చేస్తుంటారు. వాళ్లను రీచ్ అవ్వడమే ఇబ్బంది తప్ప రీచ్ అయితే గనుక తమ వంతుగా ఏదో సహాయం చేస్తుంటారు. ఇప్పటి వరకూ వారంతా చాలా సినిమాలకు సహకరించారు. ఇలా జరగాలంటే వాళ్లకు మధ్యలో ఉండే వ్యక్తులు ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ రకమైన రాజకీయాలే ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇదంతా బయటకు కనిపించని రాజకీయం. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అన్నది పెద్ద పెద్ద హీరోలకు తెలియదు. మధ్యలో వాళ్ల మాటలతోనే మోసపోతుంటారు. స్టార్ హీరోలంతా ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్తగా ఉంటే? చిన్న నిర్మాతలకు కొన్ని రకాల ఇక్కట్లు..ఇబ్బందులు తప్పుతాయి. లక్షలు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయాల్సిన పని ఉండదు.
డైరెక్టర్ల విషయంలో ఈ సమస్య పెద్దగా ఉండదు. చాలా మంది దర్శకులు గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన వారే ఎక్కు వగా ఉంటారు. కాబట్టి ఓ దర్శకుడి , నిర్మాత కష్టాన్ని ఈజీగా అర్దం చేసుకుంటారు. తమ వంతు సహాయాన్ని ఎప్పు డూ చేయ డానికి సిద్దంగానే ఉంటారు. కుళ్లు రాజకీయాల్ని ముందుగానే అంచనా వేయగల రు. ఎవర్ని ఎక్కడ పెట్టాలో? అక్కడ పెడతారు కాబట్టి చిన్న నిర్మాతలకు స్టార్ డైరెక్టర్ల వద్ద కొన్ని వెసులు బాట్లు దొరుకుతుంటాయి.