బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హోరాహోరీగా తలపడి ఫస్ట్ కామనర్ గా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి అడుగుపెట్టిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల మొదటి మూడు వారాలు హౌస్ లో ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. ప్రియా తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ ముఖ్యంగా బిగ్ బాస్ ట్రోఫీ కి ఫేవరెట్ గా మారిపోయాడు. అందుకు తనూజ నే కారణమంటూ జనాలే కాదు బిగ్ బాస్ కూడా కళ్యాణ్ పడాల జర్నీలో చెప్పాడు.
ఒకరి(తనూజ) స్నేహం మిమ్మల్ని మీరు నిరూపించుకునేలా, మీ తప్పులను సరిదిద్దుకునేలా, మీకు ఓ లక్ష్యం ఏర్పడేలా చేసింది అంటూ కళ్యాణ్ పడాల టాస్క్ ల్లో ఎంతటి ధీరత్వాన్ని చూపించాడో చెబుతూనే బిగ్ బాస్ తనూజ స్నేహాన్ని, ఆమె వల్ల కళ్యాణ్ షైన్ అయిన విధాన్ని ఎక్కువగా కళ్యాణ్ పడాల జర్నీ లో ప్లే చేసాడు. వైల్డ్ కార్డు ఎంట్రీలు, శ్రీజ లాంటి వాళ్ళు వీరి స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నా.. వారు మాత్రం ఫుల్ క్లారిటీ తో ఉన్నారు.
కళ్యాణ్ పడాల కి తనూజ అంటే క్రష్ ఉంది, కానీ తనూజ సైడ్ నుంచి కళ్యాణ్ కి స్నేహమే దొరికింది. అతన్ని 100 శాతం తనూజ స్నేహమే ఫైనల్స్ కి చేర్చింది. ఆ విషయం కళ్యాణ్ కూడా చెబుతాడు. అతను ఆడాడు, ఓడాడు, అన్నిటి వెనుక తనూజనే ఉంది. అదే బిగ్ బాస్ కళ్యాణ్ జర్నీలో స్పష్టం చేసారు. కళ్యాణ్ పడాల vs తనూజ మధ్యలో సీజన్ 9 ట్రోఫీ ఉంటుంది. బయట వారిరువురి ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.
ఒకవేళ కళ్యాణ్ పడాల గెలిచినా అందులో సగభాగం తనూజ నే ఉంటుంది అంటూ తనూజ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు, అందులో నిజం లేకపోలేదు, అతన్ని అంతగా తనూజ మోటివేట్ చేసింది.