ప్రభాస్ బాహుబలి నుంచి చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. వరస కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ప్రభాస్ సినిమాలు విడుదల కావు. ఇప్పుడు కూడా రాజాసాబ్ పలుమార్లు విడుదల తేదీలు వాయిదాలు వేసుకుంటూ జనవరి 9 కి ఫిక్స్ అయ్యింది. ఆతర్వాత ప్రభాస్-హను ల ఫౌజీ వచ్చే ఏడాది ఆగష్టు అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు మేకర్స్.
అదే ఊపులో రీసెంట్ గా సందీప్ వంగ తో ప్రభాస్ స్పిరిట్ మొదలు పెట్టారు. మరి ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తున్నా ప్రభాస్ వలనే సినిమా షూటింగ్స్ లేట్ అవుతూ వస్తున్నాయనేది వాస్తవం. తాజాగా సందీప్ వంగ న్యూ ఇయర్ కి ఎలాంటి బ్రేక్ లేకుండా స్పిరిట్ షూట్ చేస్తున్నారట. సో ప్రభాస్ కూడా న్యూ ఇయర్ కి బ్రేక్ తీసుకోవడానికి లేదు.
స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఆయన జపాన్ వెళ్లొచ్చారు, ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా స్పిరిట్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తుంది. అది చూసాక ప్రభాస్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా చెయ్యగలరా అనే అనుమానం ప్రభాస్ ఫ్యాన్స్ లోనే ఉంది. ఆయన ఒకేసారి ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటించడమే అభిమానులకు సర్ ప్రైజ్.