ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేస్తున్నారు, అందులో భాగంగా మెడికల్ కాలేజీలను దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి రాగానే రెండు నెలల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇలానే ఇన్వెస్టర్స్ ని బెదిరించి ఏపీ అభివృద్ధికి అడ్డుపడిన జగన్ మరోమారు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు.
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ కోటి సంతకాలను సేకరించి గవర్నర్ కు సమర్పించారు. గవర్నర్ ను కలిసే ముందు జగన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల అంశంలో ఎవరైతే వాటిని దక్కించుకుంటారో వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతాను అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.
జగన్ బెదిరింపు వ్యాఖ్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫైర్ అవుతూ.. దమ్ముంటే ముందు జగన్ తనను జైలుకు పంపాలని జగన్ కు ఛాలెంజ్ విసిరారు, అంతేకాకుండా ఎన్నో అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ముందు జైలుకు పోకుండా చూసుకో అంటూ సత్య కుమార్ జగన్ కామెంట్స్ పై స్పందించారు.
అంతేకాకుండా మెడికల్ కాలేజీల విషయం కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం. ఎన్డీయే ప్రభుత్వం నీతి అయోగ్ ప్రతిపాదనతో, న్యాయస్థానాలు, పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్థించిన విధానం ఇది. దేశంలో దాదాపుగా 20 రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానం, మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు.