హీరోయిన్ నిధి అగర్వాల్ కి హైదరాబాద్ లులు మాల్ లో జరిగిన ద రాజా సాబ్ సాంగ్ లంచ్ ఈవెంట్ తర్వాత అభిమానులు నిధి అగర్వాల్ తో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవడమే కాదు, ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసారు. నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడడమే కాదు, ఆమెను ఇష్టం వచ్ఛినట్టుగా తాకుతూ ఆల్మోస్ట్ నలిపేసినంతపని చేశారు.
నిధి అగర్వాల్ బాడీ గార్డ్స్ ఎంతగా సేఫ్ గా కారు ఎక్కించడానికి ప్రయత్నం చేసినా అభిమానులు ఆమెను ఊపిరి ఆడకుండా చేసిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే నిధి అగర్వాల్ ఆ సంఘటన వల్ల సహనం కోల్పోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఆమె పని ఆమె చేసుకుంటుంది. రాజా సాబ్ సెకండ్ సింగిల్ ని టీవీ లో చూస్తూ బయట ఆమె కాలు కదిపిన వీడియో షేర్ చేసింది.
అంతేకాదు రాజాసాబ్ సెకండ్ సాంగ్ కి దర్శకుడు మారుతి కూతురుతో కలిసి స్టెప్స్ వేసింది. ఇలా నిధి అగర్వాల్ లులు మాల్ సంఘటన తర్వాత మూవ్ ఆన్ అవుతూ రాజా సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొనడం చూసి ఆమె సహనానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.