మంచి మంచి సినిమాలు చేసినా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన నేహా శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేసింది. గ్లామర్ ఫొటోస్, అలాగే బ్యూటిఫుల్ లుక్ తో ట్రెడిషనల్ గా ఉండే ఫొటోస్ షేర్ చేస్తూ దర్శకనిర్మాతలను కవ్విస్తుంది. డీజే టిల్లు లో రాధిక గా బోల్డ్ కేరెక్టర్ లో చెలరేగిపోయిన నేహా శెట్టి కి ఆతర్వాత అంత మంచి కేరెక్టర్స్ పడలేదు.
ప్రస్తుతం అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియా లుక్ చూసిన వారు అయ్యో ఇంత అందాన్ని దర్శకులు ఎందుకు కన్సిడర్ చెయ్యడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా నేహా శెట్టి షేర్ చేసిన పిక్స్ చూసిన వారు వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
పింక్ డిజైనర్ లంగా ఓణీ లో నడుముకు వడ్డాణం పెట్టి మెడలో నెక్ లెస్ తో అద్భుతమైన ఫోటోలకు ఫోజులిచ్చింది. ట్రెడిషనల్ లుక్ అయినా నేహా శెట్టి ఆకర్షణగా అందంగా ఆకట్టుకుంది.