చాలామంది ఆడియన్స్ కి హీరోల మాస్ ఎలివేషన్స్ కిక్ ఇస్తాయి. మాస్ ఆడియన్స్, అభిమానులకు హీరోల ఎలివేషన్ సీన్ పడితే చాలు వారికి కడుపు నిండిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కథల కన్నా ఎక్కువగా ఈ మాస్ ఎలివేషన్స్ ని దర్శకులు హైలెట్ చేస్తూ ఉంటారు. అభిమానుల కోసమే దర్శకులు అలాంటి సీన్స్ పెడతారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమాలు చేసే ఏ దర్శకులైనా కథ కన్నా ఎక్కువగా రజిని కి ఎలివేషన్స్ సీన్స్ రాస్తారు, అవి అభిమానులకు నచ్చినా అవి కామన్ ఆడియన్స్ కి నచ్చట్లేదు. అందుకే సూపర్ స్టార్ కి ఎన్నో ఏళ్ళు హిట్ అనేది లేకుండా పోయింది. తాజాగా నందమూరి బాలకృష్ణ కోసం బోయపాటి అలానే అఖండ తాండవంలో ఎలివేషన్ ఇచ్చారు.
అది మరీ టూ మచ్ ఎలివేషన్. అవి నందమూరి ఫ్యాన్స్ కి నచ్చినా చాలామంది మాస్ ఆడియన్స్ కి నచ్ఛలేదు, అఖండ 2 చూసాక ఇంత మాస్ ఎవరు భరిస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. బోయపాటి గత సినిమా స్కంద కూడా రామ్ ఎలివేషన్స్ తోనే సినిమా అయ్యిపోయింది.
ఇప్పుడు అఖండ 2 లోను బాలయ్య ను అలానే చూపించారు. సింహ, లెజెండ్, అఖండ లో బాలయ్యకు ఎలివేషన్ ఇచ్చినా.. దానికి సరిపోయే కథ, అందులో దమ్ము ఉన్నాయి కాబట్టే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ అఖండ 2కి అదే మైనస్ అయ్యింది. మరి బోయపాటి ఇకపై ఈ మాస్ వదిలేసి స్టయిల్ మార్చాలంటూ నెటిజెన్స్ కోరుకుంటున్నారు.