మరో రెండు శుక్రవారాలతో 2025 ఏడాది సినిమా క్యాలెండర్ ముగుస్తుంది. డిసెంబర్ 19, 26 రెండు శుక్రవారాలు రాబోతున్నాయి. ఈ రెండు శుక్రవారాలు కలిపి ఏకంగా 12 సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. రేపటి రోజున `శకుటుం బానాం`, `గుర్రం పాపిరెడ్డి`, అవతార్ 3 లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అటుపై వచ్చేవారం`ఛాంపియన్`, `షంబాల` , `పతంగ్`, `ఈషా` `దండోరా` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
వీటితో పాటు`వృషభ`, `మార్క్` అనే ఇతర భాషల చిత్రాలు అనువాదంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటన్నింటికంటే? హైలైట్ అయ్యే చిత్రం మాత్రం `అవతార్ 3` ఒక్కటే. అవతార్ రెండు భాగాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో థర్డ్ పార్ట్ `ఫైర్ అండ్ యాష్` పై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రఖ్యాత సంస్థలు రివ్యూలు కూడా ఇచ్చేసాయి. రివ్యూలు చూసి వాటిలో కొన్ని సంస్థలు మంచి రేటింగ్ ఇవ్వగా? మరికొన్ని ఆశించిన స్థాయిలో రివ్యూలు ఇవ్వలేదు.
అయితే ఇది కేవలం రివ్యూవర్ అభిప్రాయం మాత్రమే. ప్రేక్షకుల అభిప్రాయం కాదు. రివ్యూవర్ల అంచనాలు చాలా సార్లు తప్పాయి. దీంతో అసలైన న్యాయ నిర్ణేతలు ప్రేక్షకుల మాత్రమే. సినిమా హిట్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అన్నది తొలి షో అనంతరం ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అంత వరకూ రివ్యూలను ప్రామాణికంగా తీసుకోవాల్సిన పనిలేదు. ప్రత్యేకించి `అవతార్ 3` సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా? అన్న ఎగ్జైటె మెంట్ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ చిత్రం రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో? అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీస్ లో బుకింగ్స్ అన్ని హౌస్ పుల్ అవుతున్నాయి. దీంతో 2025 ముగింపు వేళ `అవతార్ 2` హైలైట్ గా నిలుస్తుంది.