బిగ్ బాస్ సీజన్ 9 ముగియడానికి జస్ట్ 2 రోజుల సమయమే ఉంది. ఈ ఆదివారమే బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే. హోస్ట్ నాగార్జున తో పాటుగా ఈ సీజన్ ఫినాలే స్టేజ్ పై ఎవరు గెస్ట్ గా కనిపిస్తారో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్5 హౌస్ మేట్స్ జర్నీ లు ప్లే చేస్తున్నారు.
కమెడియన్ ఇమ్మానుయేల్ జర్నీ లో ఇమ్ము ని హీరోగా పొగిడేశారు బిగ్ బాస్, ఇక తనూజ ను చిచ్చర పిడుగు అంటూ ఎలివేషన్ ఇచ్చారు, డిమోన్ పవన్ ఓడిన చోటే గెలిచావ్ అంటూ పవన్ జర్నీ ప్లే చేసారు. ఇక కళ్యాణ్ పడాల, సంజన జర్నీలు ప్లే చెయ్యాల్సి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీస్ చూసి వారి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.
తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ లు తమ జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9 లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మానుయేల్ ఈముగ్గురిలో ఎవరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటారో అనేది అందరిలో ఆసక్తి కనిపిస్తుంది.