సవతుల మధ్య ఫైటింగులు ఎప్పుడూ చర్చగా మారుతుంటాయి. ఇటీవల పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మాజీ భార్యలు ప్రియాకపూర్, కరిష్మాకపూర్ మధ్య 30వేల కోట్ల ఆస్తుల కోసం పోరాటం కొనసాగుతోంది. కోర్టుల పరిధిలో సమస్య అపరిష్కృతంగా ఉంది. కానీ ఈ కథకు భిన్నమైనది హేమమాలని వర్సెస్ ప్రకాష్ కౌర్ వార్. లెజెండరీ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణానంతరం అతడి మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఆమె వారసులు సన్నీడియోల్, బాబి డియోల్ తో ఆస్తుల కోసం హేమమాలిని ఆమె కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ ఏమాత్రం పోరుబాట పట్టలేదు. తన తండ్రికి ఉన్న 350 కోట్ల ఆస్తుల కోసం హేమమాలిని ఆశపడలేదు. ప్రస్తుతానికి ఎవరికి వారు హుందాగా వ్యవహరిస్తుండడం చర్చగా మారింది.
కపూర్ ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు ఇక్కడ డియోల్ ఫ్యామిలీలో ఉన్నాయి. సంజయ్ కపూర్ మరణించిన 11 రోజుల తర్వాత ఆ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ మొదలైంది. ఇటీవల ధర్మేంద్ర మరణానంతరం అలాంటి గొడవ ఈ ఇంట్లోను సవతుల మధ్య మొదలైపోతుందని అంచనా వేసారు. కానీ హేమ మాలిని ఎంతో హుందాగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే తన స్ఫూర్తి వంతమైన స్పీచ్ లో హేమమాలిని హుందాతనం గురించి, వ్యక్తిత్వం గురించి ప్రత్యేకించి ప్రశంసలు కురిపించారు.
ధర్మేంద్ర మరణానంతరం ఆయన మొదటి కుటుంబం (ప్రకాష్ కౌర్, సన్నీడియోల్, బాబి డియోల్) హేమమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెలను పట్టించుకోకుండా వదిలించుకున్నారని శోభా డే ఆరోపించారు. అయినా తన మనిషి మరణించాక స్వతంత్య్రంగా సంస్మరణ సభల్ని నిర్వహించిన హేమమాలిని, ఎంతో హుందాగా నడుచుకున్నారని రచయిత్రి శోభా డే వ్యాఖ్యానించారు. ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పది అని పొగిడేశారు. తన భర్తను కోల్పోయాక హేమమాలిని మానసిక భావోద్వేగ పరిస్థితుల గురించి చక్కగా వివరించారు.
ఆస్తుల కోసం హుందాతనాన్ని కోల్పోవడం హేమమాలినికి ఇష్టం లేదని కూడా గతంలో కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అలాగే డియోల్ ఫ్యామిలీ, హేమ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా స్థిరపడినవి కాబట్టి ఇలాంటి గొడవలు అవసరం లేదని భావిస్తారని కూడా కథనాలొచ్చాయి.