సినిమా సెలబ్రిటీస్ వస్తున్నా, లేదంటే అభిమాన హీరోలు, హీరోయిన్లు ఎక్కడికైనా వస్తున్నారు అంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలామంది ఆకతాయిలు తయారై అక్కడ ఆ సెలబ్రిటీస్ తో ఫోటొస్ దిగేందుకు ఎగబడుతూ ఉటారు. అందుకే ఈవెంట్ నిర్వాహకులు బౌన్సర్లు ను ఏర్పాటు చేసి సెలబ్రిటీస్ కి రక్షణ కల్పిస్తూ ఉంటారు. అయినప్పటికి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ద రాజా సాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లులు మాల్ లో నిర్వహించారు. ఆ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నిధి అగర్వాల్ తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో అభిమానులు గుమ్మిగూడి ఆమెతో ఫోటొస్ దిగేందుకు ఉత్సాహం చూపించారు.
అంతేకాదు ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ఆమెపైకి దూసుకురావడం వెనుక ఆ ఈవెంట్ నిర్వాహకులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడమే అంటున్నారు. నిధి అగర్వాల్ బాడీ గార్డ్స్ ఎలర్ట్ అయ్యి ఆమెను సేఫ్ గా కారు ఎక్కించగా నిధి ఊపిరి పీల్చుకున్న వీడియో సంచలనంగా మారింది.