మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` మినహా పాన్ ఇండియా హీరోలెవరు? బాక్సాఫీస్ ముందుకు రాలేదు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ అంతా కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో? పాన్ ఇండియా రిలీజ్ లు కనిపించలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్ల సినిమాలేవి కనిపించలేదు. మరి 2026 లో అందుకు ఆస్కారం ఉందా? కొన్ని క్రేజీ రిలీజ్ లు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది` పాన్ ఇండియాల ఓరిలీజ్ అవుతుంది.
ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. అయితే కంటెంట్ పరంగా రీచ్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలను బట్టి మెయిన్ టార్గెట్ రీజనల్ మార్కెట్ గానే కనిపిస్తోంది. చరణ్ మాస్ ఇమేజ్ పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా? అన్న సందేహాలైతే ఉన్నాయి. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అంతకు ముందు పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ నటిస్తోన్న `ది రాజాసాబ్` జనవరిలో రిలీజ్ అవుతుంది.
మారుతి దర్శకత్వం వహిస్తోన్న కామెడీ హారర్ థ్రిల్లర్ ఇది. ఈ కాన్సెప్ట్ కూడా పాన్ ఇండియాకి ఎంత వరకూ కనెక్ట్ అవుతుందా? ఫలితం తర్వాత గానీ తేలదు. రీజనల్ మార్కెట్ లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది ప్రభాస్ నటిస్తోన్న `పౌజీ` కూడా రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథ కావడంతో? పాన్ ఇండియాలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
`సీతారామం`తో హను రాఘవపూడి పాన్ ఇండియాలో మంచి విజయం అందుకున్న అనుభవం కూడా ఉంది. దీంతో `పౌజీ` 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న కంటెంట్ గా చెప్పొచ్చు. అయితే ఒక్క బాలీవుడ్ మార్కెట్ నుంచే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తేనే? ఏ సినిమా అయినా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంటుంది. నార్త్ బెల్ట్ లో వీక్ టాక్ వచ్చిందంటే మాత్రం 1000 కోట్ల క్లబ్ అంత సులభం కాదు.