ఈ ఏడాది ఎలాంటి హడావిడి లేకుండా వదిలేసిన మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ మొత్తం నాదే అంటున్నారు. జనవరి 12 న మన శంకర వరప్రసాద్ గారు తో అనిల్ రావిపూడి తో కలిసి రాబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే మీసాల పిల్లా, శశిరేఖ సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
ఆచిత్రం తో పాటుగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏప్రిల్ లో వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఈఏడాది జనవరి లో పోస్ట్ పోన్ అయ్యి సీజీ వర్క్ వలన వచ్చే ఏడాది ఏప్రిల్ కి షిఫ్ట్ అయ్యింది. మరి 2026 ప్రథమార్ధమంతా మెగాస్టార్ చిరు సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.
అదే ఏడాది రామ్ చరణ్ పెద్ది, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదల కాబోతున్నాయి. సో మెగా ఫ్యాన్స్ కి 2026 స్పెషల్ గా నిలవబోతుంది.