2025 ని సక్సెస్ ఫుల్ గా ముగించేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం శ్రీలంక వెకేషన్ కి వెళ్ళింది. ఈ ఏడాది అటు కెరీర్ లోను ఇటు వ్యక్తిగతంగానూ రష్మిక కు స్పెషల్ అనే చెప్పాలి. సక్సెస్ ఫుల్ సినిమాల్తో అద్దరగొట్టిన రష్మిక ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో నిశ్చితార్ధం చేసుకుంది.
2026 ఫిబ్రవరిలో పెళ్ళికి సిద్దమవుతున్న రష్మిక ప్రస్తుతం శ్రీలంక లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడం హైలెట్ అయ్యింది. శ్రీలంక లో రష్మిక మొత్తం గర్ల్స్ గ్యాంగ్ తో చిల్ అవుతున్న ఫొటోస్ ని షేర్ చేసింది. అంతేకాకుండా నాకు ఈమధ్యనే రెండు రోజుల సెలవు వచ్చింది. నా గర్ల్స్ తో కలిసి తప్పించుకునే అవకాశం నాకు లభించింది.
మేము శ్రీలంకలోని ఈ అందమైన ప్లేస్ కి వెళ్ళాము. గర్ల్స్ ట్రిప్స్.. అది ఎంత చిన్నది, బెస్ట్ అనేది పట్టింపు లేదు !! నా గర్ల్స్ బెస్ట్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయితే రష్మిక విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకునేముందు తన స్నేహితులతో కలిసి ఇలా బ్యాచిలొరెట్ పార్టీ చేసుకుంది, రష్మిక-విజయ్ లు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అందుకే ఇలాంటి స్పెషల్ పార్టీ అంటూ రష్మిక అభిమానులు, విజయ్ దేవరకొండ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.