`ఈరోజుల్లో` సినిమాతో శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సక్సెస్ ఊపులో శ్రీ కూడా ఆరేడు చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవేవి పెద్దగా విజయం సాధించలేదు. తొలి సినిమా ఈరోజుల్లో తో పెద్ద బ్రేక్ వచ్చినా? తర్వాత సినిమాలేవి సక్సెస్ అవ్వలేదు. దీంతో ఇంకొంత కాలం ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయాడు.
విజయవాడలో బిజినెస్ లు చేసుకుంటున్నాడు. వివాహం కూడా అయింది. అయినా నటుడిగా పని చేయోచ్చు? కదా అని కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించింది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉంటేనే గుర్తింపు లేదంటే? కుక్క కన్నా హీనంగా చూస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం శ్రీ కూడా ఓపెన్ గానే చెప్పాడు. దీంతో సినిమా ల్ని అతడు లైట్ తీసుకున్నాడు. అయితే ఓ రోజు ఓ పెద్ద డైరెక్టర్ నుంచి సినిమా ఛాన్స్ అని రాత్రి ఫోన్ చేసి ఉదయం 6 గంటలకు సెట్స్ లో ఉండాలని ఆదేశించాడు.
దీంతో శ్రీ కూడా రాత్రి కి రాత్రే బయల్దేరి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాడు. కానీ అక్కడ అతడికి అవమానమే ఎదురైంది. 6 గంటలకు సెట్స్ లో ఉన్నా ఆ డైరెక్టర్ శ్రీని పిలవలేదు. ఎంతకూ పిలవకపోవడంతో శ్రీ ఛాన్స్ తీసుకుని పిలిపించా రని అడిగితే ఆఫీస్ లో కలుద్దామని బధులిచ్చి వెళ్లిపోయాడుట. దీంతో ఉదయం నుంచి సాయంత్ర వరకూ సెట్స్ లో నిలబడాల్సి వచ్చిందన్నాడు. ఇలాంటి అనుభవాలు కొత్తేం కాదని..గతంలో కొన్ని సినిమాల విషయంలో ఇలాగే జరిగిందన్నాడు. మరి అలా నిలబెట్టిన ఆ పెద్ద డైరెక్టర్? ఎవరు అని వివరాలు అడిగితే మాత్రం అతడి పేరు చెప్పలేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటూ లైట్ తీసుకున్నాడు.