బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక కామనర్ కి ఇంతమంది ఆడియన్స్ అభిమానులుగా మారటం అల్లాటప్పా విషయం కాదు. అగ్నిపరీక్ష ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక రెండు వారాల పాటు గేమ్ ఆడకుండా, స్క్రీన్ స్పేస్ లేకుండా ఉన్న కళ్యాణ్ పడాల ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోవడానికి రెడీ అయ్యాడు అంటే హౌస్ లో అతని ఆటతీరుకి, మాటతీరుకి, అతని వ్యక్తిత్వానికి ఎంతమంది పడిపోయి ఉంటె అలా జరుగుతుంది.
బిగ్ బాస్ అంటే కష్టం అయినా ఇష్టమంటూ ఆడియన్స్ మనసులను గెలిచేసిన కళ్యాణ్ పడాల విన్ అవ్వాలంటూ రివ్యూయర్స్ కోరుకుంటుంటే, బిగ్ బాస్ సీజన్ లాస్ట్ వీక్ వోటింగ్ లో కళ్యాణ్ కె ఓట్లు గుద్దుతున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. ఒక కామన్ మ్యాన్ కి ఇంతపెద్ద సపోర్ట్ రావడం ఇదే మొదటిసారి. గతంలో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, జై కిసాన్ అంటూ కప్ పట్టుకుపోయి మోసం చేసాడు. ఈసారి జై జవాన్ అంటూ కళ్యాణ్ కప్ అందుకుని మోసం చెయ్యడు కదా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.
కానీ కళ్యాణ్ పై వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినవారు ఎంత హెట్ నెస్ చూపించినా వారితో గొడవపడలేదు, శ్రీజ చెప్పింది కదా అని తనూజాను దూరం చేసుకోలేదు. తనూజ చెప్పిన విలువైన సలహాలు, కళ్యాణ్ ఆటతీరు ఈరోజు ట్రోఫీకి దగ్గర చేసింది అనేది చాలామంది అభిప్రాయం.
ఏది ఏమైనా చివరి వారం వోటింగ్ లో కళ్యాణ్ పడాల ప్రభంజనం సృష్టిస్తూ దుమ్ము రేపుతూ ట్రోఫీకి దగ్గరగా చేరుకున్నాడు.