యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తారు అనుకుంటే దేవర తో దెబ్బతిని, వార్ 2 అంటూ హిందీ మర్కెట్ లోకి అడుగుపెట్టారు. వార్ 2 లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ కి వార్ 2 బిగ్ షాక్ ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ మరోసారి బిగ్ మిస్టేక్ చేయబోతున్నారా అనేలాంటి న్యూస్ కనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. అది బాలీవుడ్ లో ఈసారి షారుఖ్ ఖాన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుబోతున్నారనే వార్త నడుస్తుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన పఠాన్ పెద్ద హిట్, దానికి సీక్వెల్ గా పఠాన్ 2 ని అనౌన్స్ చేసారు.
తాజాగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారనే వార్త హైలెట్ అవుతుంది. ఆ న్యూస్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మరోమారు ఎన్టీఆర్ అలాంటి తప్పు చెయ్యకూడదని కోరుకుంటున్నారు.