ఎప్పుడు గ్లామర్ గా నాజూగ్గా కనిపించే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాత్రమే కాదు నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామర్ షో తోనే రకుల్ ప్రీత్ వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో దే దే ప్యార్ దే 2 హిట్ తో రకుల్ కెరీర్ గాడిన పడింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సన్నబడేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ఓ డాక్టర్ ఆమె పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
ఒకప్పుడు బొద్దుగా ఉన్న రకుల్ ప్రీత్ ఇప్పుడు ఇలా చాలా సన్నగా అవ్వడానికి కారణం.. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ఆ డాక్టర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ డాక్టర్ పై రకుల్ ప్రీత్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. అసలు అతను డాక్టరేనా అంటూ అతనిపై రకుల్ రెచ్చిపోయింది.
ఎవరి గురించైనా మాట్లాడే ముందు అన్ని నిజాలు తెలుసుకుని మాట్లాడాలి, ఒక నటిగా తనకు ప్రాచీన, ఆధునిక శాస్త్రాల గురించి తెలుసని.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం తప్పు కాదని.. కాకపోతే కేవలం ప్లాస్టిక్ సర్జరీతోనే బరువు తగ్గుతారనేది నిజం కాదు, కష్టపడి వ్యాయామాలు చేసి కూడా బరువును తగ్గించుకోవచ్చు అంటూ రకుల్ సదరు డాక్టర్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
అంతేకాకుండా ఇలాంటి ఫ్రాడ్ డాక్టర్స్ తో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ రకుల్ సోషల్ మీడియా వేదికగా సదరు డాక్టర్ పై ఫైర్ అయ్యింది.