గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో అస్సలు వినిపించని పేరు మెహ్రీన్ కౌర్. ఆమె హర్యానాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని కొద్దినెలల్లో దాన్ని బ్రేక్ చేసుకుంది. ఆతర్వాత ఆమెకు అవకాశాలు రాకో, లేదంటే తీరిక లేకో టాలీవుడ్ సినిమాలు చెయ్యడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వెకేషన్ పిక్స్ తో హడావిడి చేస్తుంది.
తాజాగా మెహ్రీన్ కౌర్ ఓ వ్యక్తిని సీక్రెట్ గా వివాహం చేసుకుంది అంటూ ప్రచారం జరగడంతో ఆ వార్తలపై మెహ్రీన్ పర్ మండిపడింది. ఆ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నేను ఓ ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నట్టుగా వార్తలు పుట్టిస్తున్నారు, మీరు రాసిన వ్యక్తితో నాకు కనీస పరిచయం కూడా లేదు, నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదు, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటె మీకు చెప్పే చేసుకుంటాను.
నేను చెప్పేవరకు నా పెళ్లిపై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యకండి, నను నమ్మండి అంటూ మెహ్రీన్ కౌర్ సోషల్ మీడియా వేదికగా పెళ్లి రూమర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. F2, F 3 తర్వాత మెహ్రీన్ కౌర్ తెలుగులో ఎక్కడా కనిపించింది లేదు.