సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో వారణాసి మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ నవంబర్ లో రామోజీ ఫిలిం సిటీలో #GlobeTrotter ఈవెంట్ అంటూ గ్రాండ్ గా నిర్వహించారు. 2027 సమ్మర్ టార్గెట్ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
టైటిల్ గ్లింప్స్ తోనే వరల్డ్ వైడ్ గా సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. ఈ చిత్రంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్. వీరి కేరెక్టర్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో రుద్రా కేరెక్టర్ లో నటిస్తున్న మహేష్ బాబు కి తండ్రిగా టాలెంటెడ్ యాక్టర్ నటిస్తారనే టాక్ నడుస్తుంది.
ఆయనే ప్రకాష్ రాజ్. గతంలోనూ ప్రకాష్ రాజ్ మహేష్ కి ఫాదర్ కేరెక్టర్ చేసారు. మహర్షి చిత్రంలో ప్రకాష్ రాజ్ మహేష్ ఫాదర్ గా కనిపించారు. ఇప్పుడు మరోమారు వారణాసిలో మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపిస్తారని అంటున్నారు. అందులో ఎంతనిజముందో రాజమౌళి చెబితేనే తెలుస్తుంది.