పాన్ ఇండియా ఆడియన్స్ కోసం అఖండ 2 తాండవంలో ఏదేదో చేసిన బోయపాటి కి నార్త్ లో బిగ్ షాక్ తగిలింది. అఖండ 2 తాండవం చిత్రం నార్త్ లో కుమ్మేస్తుంది, శివతాండవం చేస్తుంది అనుకుంటే అఖండ 2 ముచ్చట నార్త్ లో అస్సలు వినిపించడం లేదు. అఖండ 2కి తెలుగు రాష్ట్రాల్లోనే మిక్స్డ్ టాక్ రాగా నార్త్ ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ అవ్వలేదు.
అసలే బాలీవుడ్ లో ధురంధర్ స్పీడు ముందు అఖండ 2 ఆనలేదు. బాలయ్య మొట్టమొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లారు. అందుకు తగ్గట్టుగానే సినిమాని ప్రమోట్ చేసారు. ముంబై లో సాంగ్ లాంచ్ బెంగుళూరు దగ్గరలో ట్రైలర్ లాంచ్, చెన్నై లో ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేసినా అఖండ 2 కి వర్కౌట్ అవ్వలేదు.
నార్త్ లో అఖండ తాండవం ఆడుతుంది అనుకున్నారు. కారణం అక్కడి ఆడియన్స్ కి డివోషనల్ టచ్ ఉంటె చాలు సినిమాలు పెద్ద హిట్ అవుతాయనే నమ్మకాన్ని కార్తికేయ 2, కల్కి చిత్రాలు నిరూపించడంతో బోయపాటి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అఖండ 2 అక్కడ పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారు. మరోపక్క ధురంధర్ దూకుడు అఖండ 2 ని నార్త్ లో కిల్ చేసింది.
తీరా చూస్తే అఖండ 2 హడావిడి నార్త్ అస్సలు కనిపించలేదు, అదే నందమూరి అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది. అఖండ 2 బాలీవుడ్ లో కుమ్మేస్తుంది అనుకుంటే చప్పుడు చేయడమే లేదు అనేది వారి బాధ.