యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 2తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. యువరాణిగా నెగెటివ్ పాత్రలో రుక్మిణి వసంత్ యాక్టింగ్ కి ఆమె లుక్స్ కి ఫిదా కానీ ప్రేక్షకులు లేరు. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ - నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది.
గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోల్లో మీకెవరు ఇష్టం, ఎవరి నటన అంటే ఇష్టం అని అడిగితె తనకు నేచురల్ స్టార్ నాని ఇష్టమని, ఆయన పెరఫార్మెన్స్ చాల నచ్చుతుంది అని చెప్పింది, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది. మరి ఈ భామకు నాని తో నటించే అవకాశం అతి త్వరలోనే వస్తుందిలే అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ బాలీవుడ్ డ్రీమ్స్ బయటపెట్టడమే కాదు అందుకు తగినట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా.. అతి త్వరలోనే తన బాలీవుడ్ అరంగేట్రం ఉంటుంది అనే హింట్ కూడా ఇచ్చింది.