కుర్ర హీరోలతో మంచి సినిమాలు చేసినా కెరీర్ సాఫీగా సాగని గ్లామర్ హీరోయిన్ ఎవరు అంటే అది నేహా శెట్టి అనే చెప్పాలి. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం అన్ని ఉన్నా లక్కు కూడా ఉండాలేమో. అదే నేహా శెట్టి కి లేదు అనిపిస్తుంది. రాధికా గా డీజే టిల్లు తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
కానీ ఆతర్వాతే నేహా శెట్టి కి మంచి సినిమా పడలేదు. అందుకే కెరీర్ ఊగిసలాటలో పడింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ తో రచ్చ చేసే నేహా శెట్టి పిక్ చూస్తే ఇంత అందాన్ని టాలీవుడ్ ఎందుకు మిస్ చేసుకుంటుంది అంటారు. మోడ్రెన్ వేర్ లో అందాలు చూపిస్తూ అద్భుతమైన ఫోజులతో మతిపోగెట్టేసింది అంటే నమ్మాలి.
OG లో స్పెషల్ సాంగ్ చేసింది, హిట్ సినిమా డ్యూడ్ లో మెరిసింది. కానీ ఎక్కడా నేహా శెట్టి పేరు హైలెట్ అవలేదు అదే ఆమె బ్యాడ్ లక్. ప్రస్తుతం అవకాశాలు లేక ఈ గ్లామర్ గర్ల్ సోషల్ మీడియానే నమ్ముకుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.