అనసూయ భరద్వాజ్ ఇప్పుడు బుల్లితెర ని పూర్తిగా అవాయిడ్ చేసి వెండితెరపై ఫిక్స్ అయిన నటి, యాంకరింగ్ ప్రపంచానికి గ్లామర్ యాడ్ చేసిన అనసూయ వెండితెరపై మాత్రం పద్దతి గల కేరెక్టర్స్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ లుక్స్ వదలడమే కాదు ఆమె అంతే బోల్డ్ గా మాట్లాడుతుంది కూడా.
తాజాగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన పిక్స్ చూసినవారు అనసూయ ఎందుకింత అతి ఈ వయసులో అంటూ కామెంట్లు పెడుతున్నారు. చీర కట్టులో అనసూయ భరద్వాజ్ అందాలు ఆరబోసిన తీరుకి మతిపోవాల్సింది పోయి ఆమెను తిడుతూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
నీ వయసెమిటి, నువ్వేమిటి అంటూ అనసూయను టార్గెట్ చేసింది. మరి గతంలో అనసూయ ఆంటీ అంటే సోషల్ మీడియాలో ఫైట్ చేసిన అనసూయ ఇప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ కి వచ్చే కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.