2026 సంక్రాంతి సూపర్ క్రేజీ గా మారబోతుంది. ఈసారి మాస్ ఆడియన్స్ ని నిరాశపరిచినా కామెడీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సిద్దమవుతుంది. అందులో ముందుగా జనవరి 9 కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రాబోతుంది. రాజా సాబ్ పక్క కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఇక ఇప్పుడు వరసగా మిగతా సినిమాలు డేట్ లు లాక్ చేస్తున్నాయి.
అందులో ముందుగా శర్వానంద్ నారి నారి నడుముమరారి జనవరి 14 భోగిని చూజ్ చేసుకుంది. ఇక మిగిలిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కాస్త కన్ఫ్యూజన్ లో ఉంటె, మెగాస్టార్ మన శంకర వార ప్రసాద్ గారు డేట్స్ లాక్ చేసేశాయి. వాల్తేర్ వీరయ్య చిత్రంతో చిరు-రవితేజ ఒకేసారి కలిసి కొడితే ఈసారి విడివిడిగా కొట్టబోతున్నారు.
అది కూడా ఒకే రోజు. జనవరి 12 నే అన్న చిరు తో తమ్ముడు రవితేజ పోటీపడుతున్నారు అని తెలుస్తుంది. జనవరి 12 న రిలీజ్ అంటూ రవితేజ భర్త మహాశయులకు డేట్ అనుకుంటున్నారట. తాజాగా చిరు-అనిల్ రావిపూడిల మన శంకర వార ప్రసాద్ గారు అదే జనవరి 12 న రాబోతున్నట్టుగా డేట్ లాక్ చేసారు.
సో ఈ సంక్రాంతికి అన్నదమ్ముల వార్ అది కూడా ఒకే రోజు ఉండబోతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. గెట్ రెడీ ఫ్యాన్స్.