బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రేమ పక్షుల్లా కనిపించిన రీతూ చౌదరి-డిమోన్ పవన్ లు తరచూ గొడవ పడడమో, లేదంటే అలగడమో, కాదు అంటే ఒకరికొకరు తినిపించుకోవమో చేస్తూ డీప్ ఫ్రెండ్ షిప్ చేసారు. మీ మధ్యన లవ్ ఉంది అంటే మాది కమ్ ఫర్ట్ ఫ్రెండ్ షిప్ అంటారు. ఏది ఏమైనా రీతూ వల్ల డిమోన్ ఆట పోయింది, డిమోన్ వల్ల రీతూ ఆటపోయింది. అందుకే టాప్ 5 లో ఉండాల్సిన రీతూ గత వారం ఎలిమినేటయ్యింది.
అయితే ఈ వారం డిమోన్ పవన్ చక్కగా సరదాగా కనిపించాడు. అతను హౌస్ లోకి వచ్చాక ఎప్పుడు జాలిగా సరదాగా కనబడలేనంతగా కనిపించాడు. టాప్ 2 కోసం పోటీలు, తనూజ తో చిలిపి అల్లరి, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ తో కలిసి తిరగడం, సంజన చుట్టూ అక్క అక్క అని తిరగడం అన్ని పవన్ ని ఈ వారం ఎక్కువ స్క్రీన్ లో ఉండేలా చేసాయి.
అదే ఈ వీకెండ్ లో నాగార్జున అడిగారు. ఏంటి పవన్ ఈ వారం చాలా జాలిగా కనిపించావ్, రీతూ వెళ్లిపోయాక సరదాగా మారిపోయావు అనగానే నిజమే సార్ ఈ వారం చాలా బాగుంది అంటూ చెప్పడం చూసి పవన్ ఇన్నాళ్లు ఏం కోల్పోయాడో తెలుసుకున్నాడుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
డిమోన్ పవన్ బిగ్ బాస్ కప్ కొడతాడని అనుకుంటే రీతూ చుట్టూ తిరిగి టాప్ 5 లో ఉంటాడో లేదో అనే అనుమానంలోకి డిమోన్ అందరిని నెట్టేశాడు.